CM Revanth: రాష్ట్రంపై ఉన్న రూ.7 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ కట్టేయగలదు..! 1 d ago
తెలంగాణపై రూ.6.70 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీఎంబర్స్మెంట్, ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు కలిపి రూ. 40వేల కోట్లపైనే ఉన్నాయని వివరించారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ప్రతీది వ్యాపారమే..మా ప్రభుత్వానికి రైతు అంటే కుటుంబమని అన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని..అసలు అలాగే ఉండిపోయిందని సీఎం రేవంత్రెడ్డి ఏద్దేవా చేశారు. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయిలో వాళ్లు ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తలుచుకుంటే రాష్ట్రంపై ఉన్న రూ. 7 లక్షల కోట్లు కూడా కట్టేయగలరు..రాష్ట్ర సంపద అంతా.. అక్కడికే వెళ్లింది కదా అని హేళన చేసారు. FEO సీఈవో ఇక్కడ భూమి కొంటే కూడా ఆయనకు రైతు భరోసా ఇవ్వమంటారని సీఎం రేవంత్రెడ్డి ఏద్దేవా చేశారు.